calender_icon.png 30 April, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమాలకు చోటు లేకుండా భూ సమస్యలు పరిష్కారం

30-04-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్  స్పష్టీకరణ 

మోతే, చివ్వేంల, ఏప్రిల్ 30:-  అక్రమాలకు చోటు లేకుండా భూ భారతి చట్టం తో భూ సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం మోతే, చివ్వేంల  మండల కేంద్రంలో స్వస్తిక్ పంక్షన్ హల్‌లో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం రైతులకు అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. భూ భారతి చట్టంను ప్రజలకు అంకితం చేయడం జరిగిందని తెలిపారు. ప్రముఖ మేధావుల పరిశీలనలో ఈ చట్టం రూపొందించారన్నారు. సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేయా లని తెలిపారు. మండలంలో అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఈ చట్టంతో అధికార వికేంద్రీకరణ చేయడం జరిగిందని తెలిపారు.

తహసీల్దార్ నుంచి కలెక్టర్ మరియు పైన ఉన్నత అధికారుల దృష్టి కి తీసుకువెళ్ళాలి సంబంధం లేని వారు భూమిపై ఉంటున్నారు. అర్హులైన వారు భూమి పైన ఉండటం లేదు కొనుగోలు చేసిన వ్యక్తి కి భూమి పట్టా కావడం లేదు అడ్డదారుల్లో భూమి అమ్మినప్పుడు హద్దులు సక్రమంగా రాయకుండా అనేక సమస్యలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ భూమి కొన్న అమ్మిన అన్నింటికీ పూర్తి హద్దులు వివరాలు ఈ చట్టం ద్వారా పకడ్బందీ గా రాసుకోవాలని తెలిపారు. మహిళలకు భూమి పైన హక్కులు ఉంటాయి కానీ ఆ కుటుంబ పెద్దలు అందరూ కలిసి సమస్యని పరిష్కారం చేసుకోవచ్చునని తెలిపారు.

భూ సమస్యల తో కుటుంబాలు విచ్ఛిన్నం కాకూడదు భాగం పంపిణీ లో అందరికి సమాన వాటాలు  ఉంటాయని తెలిపారు. భవిష్యత్ లో భూ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలి సాదా బైనామా ద్వారా సీలింగ్ ఇనాం భూముల సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేయడం జరుగుతుందని  రాబోయే రోజుల్లో రెవిన్యూ సదస్సులు ఏర్పాటుతో  గ్రామా లలో ఏమైనా సమస్యలు ఉంటే తక్షణ పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ప్రణాళిక ప్రకారం ప్రతి పనిని పరిష్కారం చేయవచ్చునని ఈ అన్నింటికీ  రెవిన్యూ సదస్సు లో పూర్తి స్థాయిలో పరిష్కారం దొరుకుతుందని తేల్చి చెప్పారు. మండలంలో లేని కాగితాలు సృష్టించి మరి పాట్టాలు చేశారని వాటికి సంబంధించి పరిష్కారం చేశామని తెలిపారు. భూమి పైన ఉన్నట్లు కాగితాలు ఉండాలని ఎక్కడైనా ఎప్పుడైనా తప్పులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.