28-04-2025 12:11:09 AM
200 ఎకరాల వ్యవసాయ భూమికి ఎసరు
ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): ఇప్పటి వరకు పట్టణాలకు, సమీప మండలాలకు పరిమితమైన భూకబ్జాలు తాజాగా ఏజెన్సీ గ్రామాలకు పాకింది. పాత తేదీలతో నకిలీ నాన్ జుడిషియల్ స్టాం ప్స్, ఫోర్జరీ సంతకాలు చేసి మరణించిన వారి పేరుతో ఉన్న భూములను కొనుగోలు చేసినట్లు భూ భకాసురులు భూకబ్జాలకు తెర లేపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గంగారం రెవెన్యూ గ్రామ పరిధిలో దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములపై కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలుస్తోంది.
పాల్వంచకు చెంది న కేటీపీఎస్ డి ఈ స్థాయి అధికారితో పాటు స్థానికులు ఇద్దరు ఈ కబ్జాకు శ్రీకారం చుట్టారని ఆరోపణలు వెలబడుతున్నాయి. దీంతో బాధితులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజుకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే సంపత్ నగర్ కు చెందిన ఓ వృ ద్ధుడి భూమిపై కబ్జాదారులు కన్నేసి గంగా రం రెవెన్యూ పరిధిలోని సంపత్ నగర్ గ్రామం లో ఉన్న భూములను తప్పుడు పత్రాలతో కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించారని తెలుస్తోంది. 1970 కంటే ముందు నుంచి ఇక్కడ రైతులు వారి భూ ముల్లో సాగు చేసుకుంటున్నారు.
రెవెన్యూ రికార్డులో రైతుల పేరు నమోదయి ఉంది. అట్టి భూ ములపై నకిలీ పత్రాలు సృష్టించి కేటీపీఎస్ లో డి ఈ గా విధులు నిర్వహిస్తు న్న అధికారి భూములను కొనుగోలు చేసినట్టు పాత తేదీల్లో తప్పుడు కాగితాలు సృ ష్టించి, అసలు రైతులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. అతనికి ఓ మా జీ రౌడీ షీటర్ , స్థానికులు ఒకరు పూర్తి సహా య సహకారాలు అందిస్తున్నట్లు సమాచా రం.
ఏజెన్సీ చట్టాలను అడ్డుపెట్టుకొని ప్రభుత్వ రికార్డుల్లో ఎలాంటి ఆధారాలు లేకున్నా, మరణించిన గిరిజనుల పేర్ల మీద పాత తేదీల పై నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి స్థానిక రైతులను బెదిరిస్తున్నట్లు సర్వత్రా ఆరోపణలు వెలబడుతున్నాయి. స్థానికంగా ఉండే ఓ రౌడీ షీటర్ ప్రణాళికలు రూపొందించి ఈ తంతు కొనసాగిస్తున్నాడని సమా చారం.
చనిపోయిన వారి పేరుతో ఉన్న భూములను కొనుగోలు చేసినట్లు నకిలీ నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లను, పాత తేదీలతో సృష్టించి కేటీపీఎస్ డి ఈ స్థాయి అధికారి కొనుగోలు చేసినట్లు పత్రాలను త యారుచేసి, అధికారులను పక్కతో పట్టిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 200 ఎకరాల కు పైగా ఇలాంటి నకిలీ నాన్ జ్యుడీషియల్ స్టాంపు పేపర్లతో కబ్జాకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వృద్ధుడి భూమి కబ్జాకు యత్నం
గంగారం రెవెన్యూ పరిధిలోని సంపత్ నగర్ గ్రామంలో 50 సంవత్సరాల నుంచి అబ్బినేని సాంబశివరావు అనే వృద్ధ రైతు కు 12.08 ఎకరాల వ్యవసాయ భూమి సా గు చేసుకుంటున్నాడు. 1968 లో కొండపల్లి గోపాల్ రావు అనే వ్యక్తి నుంచి సాంబశివరావు కొనుగోలు చేసినట్లు పహనీలు ఉన్నా యి. అప్పటి నుంచి రెవెన్యూ రికార్డులో సాంబశివరావు పేరు కొనసాగుతోంది.
ఆ భూమిపై కబ్జాకోరుల ముఠా కన్ను పడింది. మరణించిన రైతుల నుంచి కేటీపీఎస్ లో డీగా పనిచేస్తున్న అధికారి నకిలీ పత్రాలు సృష్టించి కొనుగోలు చేసినట్లు రికార్డులను తయారు చేశారు. 17 సంవత్సరాల క్రితం ఆ భూమి అమ్మకాలు, కొనుగోలు జరిగినట్లు రికార్డులు తయారు చేశారు.2008 సంవత్సరములో రెడ్డి రామయ్య నుంచి తాటి లక్ష్మయ్య కొనుగోలు చేసినట్టు ఒక నకిలీ స్టాంప్ పేపర్ పై ఫోర్జరీ సంతకాలు చేసి తప్పుడు పత్రాలు సిద్ధం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్టాంప్ పేపర్లను కొనుగోలు చేసినట్లు చూపించారు. అట్టి భూమిని 2017 లో కే టి పి ఎస్ డి ఈ కి అమ్మినట్లు మరొక నకిలీ పత్రాలను సృష్టించారు. రెడ్డి రామయ్య, తాటి లక్ష్మయ్యలు గతంలో ఎప్పు డో మరణించారు.
వారి పేరుతో గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు సృష్టించడంతో కబ్జా కోరుల బండారం బహిర్గతమైంది. అసలు రైతు అబ్బినేని సాంబశివరావు, మనవడు స మాచార హక్కు చట్టం ద్వారా గుడివాడ సబ్ రిజిస్టార్ ను సమాచారం కోరగా, సదరు స్టాంప్ పేపర్ తమ కార్యాలయం పరిధిలోనిది కాదని, నకిలీదని సమాచారం ఇవ్వడం తో వాస్తవం వెలుగులోకి వచ్చింది.
ఇదే తరహాలో సుమారు 200 ఎకరాలకు పైబడి తప్పుడు పత్రాలతో కబ్జాకోరులు భూముల ఆక్రమణకు పాల్పడుతున్నట్లు తేటతెలమైం ది. తన దగ్గర ఉన్న ఆధారాలతో సాంబశివరావు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జిల్లాస్థాయి అధికారులు కబ్జాకోరుల ఆగడాలను అరికట్టి తమ భూములకు రక్షణ కల్పించాలని గంగారం రెవెన్యూ పరిధిలోని రైతులు కోరుతున్నారు.