calender_icon.png 23 January, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ పత్రాలతో మూడు కోట్ల స్థలం కబ్జా

23-01-2025 12:54:35 PM

ఇద్దరు కేటుగాళ్లకు రిమాండ్ విధించిన కోర్టు  

రాజేంద్రనగర్,విజయక్రాంతి: నకిలీ పతాలతో మూడు కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసిన ఇద్దరు అన్నదమ్ములకు కోర్టు రిమాండ్ విధించింది. కేసు వివరాలను మైలార్దేవ్ పల్లి ఇన్స్పెక్టర్ నరేందర్ మీడియాకు వెల్లడించారు. గగన్ పహాడ్ లో సుమారు 500 గజాల స్థలం రూ. 3 కోట్ల విలువ ఉంటుంది. దానిపై ఇద్దరూ కేటగాళ్లు కన్ను వేశారు. 

సమీపంలో ఉన్న ఏకేఆర్ బార్ అండ్ రెస్టారెంట్, ఏకేఆర్ పెట్రోల్ పంప్ అధినేతలు అశోక్ కుమార్, కిషోర్ కుమార్ నకిలీ పత్రాలు సృష్టించి దానిని కబ్జా చేసేందుకు యత్నించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మైలార్దేవపల్లి పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. మూడు నెలల తరువాత ఉప్పర్ పల్లి కోర్టు తీర్పు మేరకు పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.