రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
మంథని,(విజయక్రాంతి): మంథని నియోజకవర్గం రామగిరి మండలంలోని లద్నాపూర్ భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ అన్నారు. హైదరాబాద్ లో ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును శుక్రవారం రాత్రి లద్నాపూర్ భూ నిర్వాసితులు కలిసి వారి సమస్యలను తెలిపారు. గ్రామంలో మిగిలి ఉన్న 283 ఆర్ అండ్ అర్ ప్యాకేజీ సమస్యలను మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... సింగరేణి ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ తొ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి భూ నిర్వాసితుల సమస్యలపై పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లద్నాపూర్ భూ నిర్వాసితులు పాల్గొన్నారు.