30-04-2025 12:33:32 AM
కల్లూరు, ఏప్రిల్ 29 :- భూ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని,ఈ చట్టంతో సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్ పేర్కొన్నారు.మున్సిపాలిటీ పరిధిలోని డీ.యన్.పి ఫంక్షన్ హల్ లో మండల రెవిన్యూ శాఖ మంగళవారం నిర్వహించిన భూ భారతి అవగాహాన సదస్సుకు ఎమ్మెల్యే ముఖ్య అతిధి గా హాజరై భూ భారతి గురించి వివరించారు.
పెండింగ్లో ఉన్న సాదా బైనామాలు సైతం భూభారతిలో పరిష్కారం చేసుకోవచ్చన్నా రు.జూన్ నెల నుంచి తహసీల్దార్లు మండలంలోని ప్రతీ గ్రామపంచాయితీ లో భూ భారతి సదస్సును నిర్వహించి రైతులకు భూ సమస్యలపై అవగాహాన కల్పించి ఈ కార్యక్రమం లో వచ్చిన దరఖాస్తులను పరిష్క రించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయుకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్,కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, కెన్ డెవలప్మెంట్ చైర్మన్ కస్తల నరేంద్ర, మండలం సీనియర్ కాంగ్రెస్ నా యుకులు పసుమర్తి చందర్ రావు,
ఆర్ .డీ.వో రాజేందర్ గౌడ్,తహసీల్దార్ పులి సాంబ శివుడు,ఇంచార్జ్ ఎంపీడీవో రంజిత్ కుమార్,వ్యవసాయ అధికారి రూప, కల్లూ రు మండలం కాంగ్రెస్ పార్టీ నాయుకులు లక్కినేని కృష్ణ, ఏనుగు సత్యం బాబు,ఆళ్లకుంట నరసింహారావు,రిటైర్డ్ కల్నల్ మాదా ల వంశీ కృష్ణ, మండల నాయకులు,గ్రామ నాయుకులు, కార్యకర్తలు,రైతులు,ఆర్.డీ. వో,రెవిన్యూ సిబ్బంది,వివిధ శాఖ ల అధికారులు,ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు తదితరు లు పాల్గొన్నారు.