calender_icon.png 19 April, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూమి స్వాధీనం

10-04-2025 12:07:09 AM

బెల్లంపల్లి అర్బన్, ఏప్రిల్ 9: మం చిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం ఆకనపల్లి గ్రామ శివారులో తలెత్తిన భూమి వివాదం పరిష్కారమైంది. ప్రభుత్వ భూమిపై వివాదం తలెత్తిం ది. రెవెన్యూ అధికారులు బుధవారం సర్వే చేశారు. అట్టి సర్వేలో 30 గుంట ల భూమి ప్రభుత్వానిదేనని తేలిపోయింది. ఆకనపల్లి గ్రామ శివారులో సర్వే నెంబరు 64లోని భూ వివాదం పై బెల్లంపల్లి తహసీల్దార్ జ్యోత్స్న ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. కొలతలు కొలిచి సర్వేచేశారు.ఈ సర్వేలో 30 గుంటల భూమి ప్రభుత్వందని తేలిపోయిందని తాసీల్దార్ జ్యోత్స్న తెలిపారు. ఈ మేరకు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ స్థలాన్ని సబ్ స్టేషన్ కోసం కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.