11-03-2025 11:17:35 PM
మాదాపూర్ డీసీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ నవీన్ రావు..
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): మాదాపూర్ ఖానామెట్లో భూవివాదం నెలకొంది. సర్వే నం. 11/37లో కొద్ది రోజులుగా భూ వివాదం జరుగుతుంది. భూమి తనదే అంటూ రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. మంగళవారం రోజు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు భూమిలోకి ప్రైవేటు వ్యక్తులు కంచె వేసేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకునేందుకు ఎమ్మెల్సీ మనుషులు ప్రయత్నించగా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు. దీంతో భూ వివాదంపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఎమ్మెల్సీ నవీన్ రావు మాదాపూర్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.