11-12-2024 12:59:40 AM
నల్లగొండ, డిసెంబర్ 10 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా తిప్పర్తి మం డలం మామిడాల గ్రామంలో భూతగాదాల కారణంగా రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఓ కుటుంబం మరో కుటుంబీకులపై దాడి చేయడంతో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మామిడాల గ్రామానికి చెం దిన గజ్జి లింగయ్య, గజ్జి చంద్రయ్య కుమారుల నడుమ కొంతకాలంగా భూవివాదం నడుస్తున్నది.
ఈ వివా దం ముదరడంతో మంగళవారం లిం గయ్యతోపాటు ఆయన కుమారులు గణేష్, శంకర్, సందీప్, పద్మ కలిసి చంద్రయ్యతోపాటు ఆయన భార్య సత్తమ్మ కుమారులు శంకర్, సైదులు, రామలింగంపై దాడి చేశారు. ఆ నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీ సులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని నల్లగొండ ప్రభుత్వ దవా ఖానకు తరలించారు. వీరిలో సత్తెమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. డాడికి పాల్పడిన వారు పరారీలో ఉన్న ట్లు సమాచారం.