calender_icon.png 18 April, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూముల వేలం వెంటనే ఆపాలి

03-04-2025 12:00:00 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి): యూనివర్సిటీ భూముల వేలంపాటను విరమించుకోవాలని సిపిఎం మండలకార్యదర్శి సైదులు ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.బుధవారం మండలంలోని మునిగలవీడు గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలంపాటను నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

అనంతరం సిపిఎం మండల కార్యదర్శి ఈసంపెళ్లి సైదులు మాట్లాడుతూ భూమిని పరిరక్షించాలని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టొద్దనిపోరాటాలు చేయడంఅరుదుగా చూస్తామని,రంగారెడ్డి జిల్లా సర్వేనెంబర్ 25 లో400 ఎకరాల భూమి అమ్మ వద్దని ప్రతిపక్షపార్టీలతో పాటువిద్యార్థి సంఘాలు పోరాటం చేస్తుంటేప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం వేలం వేస్తోందని అన్నారు.

వేలం పాట వేసి భూములను అమ్మడం వల్లపర్యావరణం దెబ్బతింటుందని, జీవవైవిద్యం నాశనం అవుతుందని అన్నారు. ఆ భూములలో యూనివర్సిటీకి సంబంధించినఇతర పరిశోధన సంస్థలను ఏర్పాటు చేయాలని అన్నారు. భూమి పరిరక్షణ కోసంసిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నీలమ్మ, అనసూర్య, సంగీత, సుజాత, ఎల్లమ్మ, సమ్మక్క, పూలమ్మ తదితరులు పాల్గొన్నారు.