02-04-2025 12:53:57 AM
వనపర్తి టౌన్, ఏప్రిల్ 1: హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల మీద, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి యూనియన్ నాయకుల మీద పోలీసుల నిర్బంధాన్ని, ఖండిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబందించిన భూముల వేలంపాటంను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రం లోని రాజీవ్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఎం పరమేశ్వర చారి అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం డి జబ్బార్ మాట్లాడుతూ హెచ్.సీ. యు భూముల రక్షణ కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో హెచ్ సి యు గేటు ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్న ధర్నాకు వెళ్లకుండా ముందస్తుగా సిపిఎం పార్టీ నాయకత్వాన్ని వనపర్తి జిల్లాలో సిపిఎం పార్టీ కార్యకర్తలను ప్రజాసంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేయడాన్ని అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకించాలని కోరారు.
అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు పట్టుబట్టి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలాన్ని వేలం వేయకుండా అడ్డుకోవాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పోరాటాల మీద, నాయకుల మీద నిర్బంధం పెరిగిందని వారు విమర్శించారు.
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వారు అనేక మాయ మాటలు చెప్పారని ఇప్పుడు అధికారం చేపట్టాక గత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఈ ప్రభుత్వం అనుసరిస్తుందని విమర్శించారు. తమ ప్రభుత్వ మనుగడ కోసం ప్రభుత్వ భూములను అమ్ముకోవడమెట్లా కరెక్ట్ అని ప్రశ్నించారు. విద్యార్థుల మీద కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం రాజు, డి బాల్ రెడ్డి. సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు డి. కురుమయ్య, గంధం మదన్, జి. గట్టయ్య, డి. బాలరాజు, నందిమల్ల రాములు, బీసన్న, కురుమయ్య, పుల్లయ్య, బాలపీరు, బాలరాజు, కమలాకర్, శ్రీనివాసులు, జి భాస్కర్, ఉమ తదితరులు పాల్గొన్నారు.