calender_icon.png 24 December, 2024 | 6:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణాలు చెల్లించకుంటే భూములకు వేలం

24-12-2024 12:16:30 AM

కామారెడ్డి జిల్లా రైతులకు బ్యాంక్ అధికారుల నోటీసులు

25 వరకు చెల్లించాలని సహకార శాఖ ఆదేశం

ఆందోళన చెందుతున్న రైతులు

కామారెడ్డి, డిసెంబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నస్రూల్లాబాద్ సహకార బ్యాంక్ అధికారులు రైతులు తీసుకున్న రుణాలు ఈ నెల 25 లోగా చెల్లించా లని, లేదంటే భూములు వేలం వేస్తామని నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీర్ఘకాల రుణాలను తీసు కున్న రైతులకు ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఎదురుచూసిన రైతులకు రుణమాఫీ జరగకపోవడంతో తీసుకున్న రుణాలకు వడ్డీ లు పెరిగి అప్పులు పేరుకుపోయాయి.

రు ణాలు ఇచ్చిన సహకార బ్యాంక్ అధికారులు రైతులకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25 లోగా రుణాలు చెల్లించకుంటే 26న రైతు ల భూములకు వేలం వేస్తామని సహకార శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పడంతో రైతులు బ్యాంక్‌కు చెల్లించాల్సిన అప్పును చెల్లించలేదు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించగా కేవలం వడ్డీ మాత్రమే మాఫీ కాగా అసలు అలాగే ఉంది.

నస్రూల్లాబాద్ మండలం దుర్కి, మిర్జాపూర్, అంకోల్, సంగెం గ్రామాలకు చెందిన 20 మందికి పైగా రైతులకు  దీర్ఘకాలిక రుణాలు రూ.కోటీ వరకు తీసుకున్నారు. ప్రస్తుతం వడ్డీతో కలిపి ఒక్కో రైతు రూ.20 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. ఈ నెల 26 వరకు ఎలా చెల్లించాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరు నెలల క్రితం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పోల్కంపేట, పరమళ్ల గ్రామాల రైతులకు కూడా ఇలాగే నోటీసులు జారీ చేశారు.