calender_icon.png 30 January, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూసేకరణ పనులలో వేగం పెంచాలి

29-01-2025 01:01:50 AM

* -జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

నారాయణపేట, జనవరి 28 (విజయ క్రాంతి): భూసేకరణ కార్యాలయ అధికారు లు, నీటి పారుదల శాఖ అధికారులు సమ న్వయంతో జిల్లాలో భూసేకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లోని  వీడియో కాన్ఫరెన్స్ హల్ లో భీమా ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు,  నారాయణపేట కొడంగల్ ఎత్తి పోతల పథకాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులపై ఆయా శాఖల  అధికారులతో కలెక్టర్ సమీక్ష జరిపా రు. 

భీమా ప్రాజెక్టు కు సంబంధించి జిల్లా లోని మక్తల్, మాగ నూర్, కష్ణా మండ లాల్లో  పెండింగ్ లో ఉన్న 45.34 ఎకరా లకు అవార్డు పాస్ అయినందున వెంటనే  ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని ఆయా మండలాల తహసిల్దార్ లను ఆదే శించారు. అలాగే 28.56 ఎకరాలకు  నష్ట పరిహారం డబ్బు ఎస్.డీ.సీ ఖాతాలో జమ అయిందని, దీనిపై కేసు కూడా నడుస్తోంద ని SDC గారు జిల్లా కలెక్టర్ కి తెలిపారు.

ఇక 74.61 ఎకరాలకు సంబంధించిన నష్టపరి హారం  డబ్బు కోర్టులో డిపాజిట్ చేసినట్లు ఎస్.డీ.సీ ( ఆర్డీవో) తెలిపారు. జిల్లా జడ్జిని సంప్రదించి వివరాలు తీసుకుంటామని ఆర్డీ వో రామచందర్, నీటి పారుదల శాఖ ఎస్. ఈ.శ్రీధర్  కలెక్టర్ కు తెలిపారు.   ఇదే కాకుం డా భీమా ప్రాజెక్టు కింద ఇంకా 16.16 ఎకరా ల భూసేకరణ వివిధ దశలలో పెండింగ్ లో ఉందని, అవార్డు పాస్ కాలేదని వారు తెలి పారు.

  నారాయణ పేట -కొడంగల్  ఎత్తిపో తల పథకం కింద మక్తల్, ఊట్కూర్, నారా యణపేట, దామరగిద్ద మండలాలలో 550 ఎకరాల భూసేకరణ  పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికా రులను ఆదేశించారు. ఇక ఆర్ అండ్ ఆర్ కు సంబంధించి జూరాల పరిధిలో ముంపు ప్రభావిత  అనుగొండ, అంకెన్ పల్లి, దాదన్ పల్లి, అలాగే సంగం బండ జలాశయం పరిధి లో ముంపు ప్రభావిత ఉజ్జల్లి, గార్లపల్లి, సంగం బండ గ్రామాలలో నెలకొ న్న సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ఆమె సూచించా రు.

వీటితో పాటు భూత్పూర్, నేరేడు గాం ముంపు ప్రభావిత గ్రామాల సమస్యల పరిష్కారానికీ  ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోనుందని కలెక్టర్  తెలిపారు.  అయితే సమావేశ ప్రారంభంలో  ఎస్. డీ.సీ అధికా రులు భూసేకరణకి సంబంధించిన పూర్తిస్థా యి వివరాలను తనకు ఇవ్వక పోవడంపై, సమావేశంలో ఫైల్స్ ఏమీ లేవని అధికారు లు జవాబు ఇవ్వడంపై జిల్లా కలెక్టర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు.

సమావేశానికి భూ సేకరణ కార్యాలయ అధికారులు, నీటి పారు దల శాఖ అధికారులు భూ సేకరణకు సంబంధించిన సమగ్ర వివరాలు, పూర్తిస్థా యి ఫైల్స్ తో  హాజరుకావాలని కలెక్టర్ ఆదే శించారు. ఏమీ లేకుండా, వివరాలు ఇవ్వ కుండా సమావేశానికి ఎందుకు వస్తారని నిలదీశారు. మరోసారి ఇది పునరావతం కాకుండా ముందస్తుగా సమగ్ర వివరాలు, జాబితాలతో  సమావేశానికి రావాలని సూ చించారు.

ఈ సమీక్షలో  ట్రైనీ కలెక్టర్ గరి మా నరుల, ఆర్డీవో రామచందర్ నాయక్, మక్తల్ సర్కిల్ ఎస్. ఈ. శ్రీధర్, మహబూబ్ నగర్ సర్కిల్ ఎస్.ఈ. చక్రధరం, పి ఆర్ ఈ ఈ హీర్యా నాయక్, ఎస్ డి సి కార్యాలయ అధికారులు, మక్తల్, మాగనూర్, కష్ణ మండ లాల తహాసిల్దార్లు పాల్గొన్నారు.