30-04-2025 12:43:00 AM
సిరిసిల్ల, ఏప్రిల్ 29 (విజయ క్రాంతి): ఆలయ రోడ్డు విస్తరణ భూసేకరణ నిమిత్తం సర్వే సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వేములవాడ ఆలయ రొడ్డు విస్తరణ, భూ సేకరణ పనుల పై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేములవాడ ఆలయం వద్ద రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, వీటికి అవసరమైన భూసేకరణ చేసేందుకు తొలగించాల్సిన నిర్మాణాల ప్రతిపాదనలను 4 టీం ల ద్వారా సర్వే చేసి అందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
భూ సేకరణ చట్టం 2013 సెక్షన్ 12 ప్రకారం భూసేకరణ నిమిత్తం సర్వే చేసే పూర్తి అధికారాలు మనకు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. చట్టంపై అధికారులు అవగాహన పెంచుకొని ఏప్రిల్ చివరినాటికి సర్వే పూర్తి చేసి ప్రతిపాదనలు భూ సేకరణ తయారు చేయాలని అన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధ భాయి, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఈ ఈ ఆర్%ఞ%బి రమణయ్య, ఈ ఈ మిషన్ భగీరథ జానకి, ఫారెస్ట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.