calender_icon.png 17 April, 2025 | 2:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాతబస్తీ మెట్రోకు జోరుగా భూసేకరణ

14-04-2025 12:13:56 AM

ప్రభావిత ఆస్తులు 1100

205 ఆస్తులకు రూ.212 కోట్ల చెక్కులు అందజేత

మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి వెల్లడి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): పాతబస్తీ మెట్రో కారిడార్‌కు జోరుగా భూసేకరణ జరుగుతోందని, స్వాధీనం చేసుకున్న ప్రభావిత ఆస్తుల్లో స్థానికుల సహకారంతో ముమ్మరంగా కూల్చివే తలు జరుగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. పాతబస్తీకి మెట్రో కారిడార్ విస్తరణ సందర్భంగా ఎంజీబీఎస్ నుంచి చంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న 7.5 కిలోమీటర్ల కారిడార్‌లో మొత్తం 1,100 ప్రభావిత ఆస్తులుండగా.. వాటిలో ఇప్పటివరకు 205 ఆస్తులకు చెక్కులు అందజేసినట్లు ఆయన తెలిపారు.

వాటికి రూ.212 కోట్ల నష్టపరిహారం చెక్కులను అందజేశామని పేర్కొన్నారు. ఈ మార్గానికి ఇరువైపులా క్లిష్టంగా ఉన్న విద్యుత్, టెలిఫోన్ కేబుళ్లను అత్యంత అప్రమత్తంగా తమ ఇంజనీరింగ్ సిబ్బంది తొలగించి మార్గాన్ని సుగమం చేశారని వెల్లడించారు. మెట్రో అధికారులు, రెవెన్యూ, పోలీస్ పర్యవేక్షణలో మెట్రో కారిడార్ విస్తరణ పనులు చురుగ్గా సాగుతు న్నాయని ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.