calender_icon.png 31 January, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎత్తిపోతల పథకాలకు భూసేకరణ పూర్తి చేయాలి

30-01-2025 12:00:00 AM

రాష్ర్ట భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

సూర్యాపేట జనవరి ౨౯ (విజయక్రాంతి) ః జిల్లాలోని నాలుగు కొత్త ఎత్తిపో తల పథకాలకు భూసేక రణ పనులు త్వరగా పూర్తి చేయాల ని రాష్ర్ట భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కమి షనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. బుధవా రం సూర్యాపేట కలెక్టరే ట్ కార్యాలయం లోని రెవెన్యూ,ఇరిగేషన్ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జిల్లాలో మంజూరైన నాలుగు ఎత్తిపోతల పథకాలైన పాలకీడు మండలంలోని బెట్ట తండా లిఫ్ట్ ఇరిగేషన్,  చింతలపాలెం మండలం  రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్, కోదాడ మండలంలోని  రెడ్లకుంట లిఫ్ట్ ఇరిగేషన్, అనంతగిరి మండలంలోని  ఉత్తమ్ పద్మావతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జిల్లాకు మంజూరు అయ్యాయని, వీటి ఏర్పాటు కొరకు భూసేకరణ  ప్రక్రియ వేగవంతం చేసి ఇరిగేషన్ శాఖకు అప్పగించాలని  ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ పి రాంబాబు, ఇరిగేషన్ ఎస్సీ శివ ధర్మ తేజ తదితరులు పాల్గొన్నారు.