14-03-2025 01:24:29 AM
జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్
ఆదిలాబాద్, మార్చ్ 13 (విజయ క్రాంతి) : రాష్ట్రంలో ఐ.టి.ఐ, ఏ.టీ.సీ సెంటర్ లు లేని గ్రామీణ నియోజకవర్గాలలో స్థల సేకరణకై గురువారం లేబర్ ఎంప్లాయిమెంట్ శిక్షణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ నిర్వహించిన జూమ్ మీటింగ్ లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు.
యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్లను (ఏటీసీ) ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఐటిఐ, ఏటీసీ సెంటర్లు లేని ప్రతి గ్రామీణ ప్రాంత నియోజక వర్గాలలో కనీసం ఒకటి చొప్పున అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జిల్లాలోని బోథ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ.టీ.సీ కేంద్రాల ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను సోమవారం లోగా పంపిస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్ శ్యామల దేవి, ఆర్డీఓ వినోద్ కుమార్, ఐ.టి.ఐ కళాశాల ప్రిన్సిపల్స్, రెవెన్యు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.