calender_icon.png 8 April, 2025 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో ఎయిర్‌పోర్టుకు భూసేకరణ

08-04-2025 12:00:00 AM

  • జిల్లా ప్రజల కల నెరవేర్చిన ప్రధాని మోదీకి ఎంపీ, ఎమ్మెల్యేల కృతజ్ఞతలు 
  • బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కేంద్ర ప్రాజెక్టులు రాలేదు

ఆదిలాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): గత పదేళ్లుగా చేసిన పోరాటం వల్లే అదిలాబాద్‌లో ఎయిర్ ఫోర్స్‌తోపాటు ఎయిర్ పోర్ట్ ఏర్పాటు సాధ్యపడిందని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఎంపీ పాల్గొన్నా రు. ఈ మేరకు ఎంపీ నగేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి సహకరించడం శుభ పరిణామం అని అన్నారు.

త్వర లోనే భూసేకరణ, మౌలిక వసతుల ఏర్పా టు జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అదిలాబాద్ జిల్లాపై దృష్టి సారిం చి అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం తో కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ... బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే జిల్లాకు రావలసిన కేంద్ర ప్రాజెక్టులు రాలేదని అన్నారు.

జిల్లాలో బీజేపీ ఎంపీ, ఎమ్మె ల్యేలు గెలిస్తే ఏమవుతుందని అన్న బీఆర్‌ఎస్ నాయకులకు జిల్లాకు ఎయిర్ ఫోర్స్, ఎయిర్ పోర్ట్ మంజూరే సమాధానం అని తెలిపారు. జిల్లా ప్రజలు కన్న కల ఎయిర్ పోర్టు మంజూరు చేసినందుకు ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో బీజేపీ నాయ కులు నగేష్, లాలా మున్నా, మయూర్ చంద్ర, జోగు రవి, దినేష్ మాటోలియా, వేదవ్యాస్, రాజు, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.