11-03-2025 08:27:28 PM
లంబాడి విద్యార్థి సేన ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం అందజేత...
సూర్యాపేట: లంబాడీల, గిరిజనులపై రోజురోజుకు జరుగుతున్న దాడులను అరికట్టాలని లంబాడి విద్యార్థిసేన రాష్ట్ర అధ్యక్షుడు ధరావత్ బాలు నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలసి లంబాడి గిరిజనలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం అందజేసి మాట్లాడారు. సమాజంలో వెనుకబడిన లంబాడీలు గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జనాభా ప్రాతిపదికన గిరిజనులకు లంబాడీలకు రిజర్వేషన్ పెంచాలని సూచించారు.
ముఖ్యంగా లంబాడీలు, గిరిజనులు విద్యార్థులు విద్యారంగంలో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గిరిజనులు లంబాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సందర్భంగా లంబాడీలకు గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలనారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు సురేష్ నాయక్ లంబాడి విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులు హరీష్ నాయక్ నాయకులు నరసింహ నాయక్ పలువురు పాల్గొన్నారు.