హనుమకొండ, జనవరి 19: హనుమకొండ 10వ డివిజన్ అలంకార్ జంక్షన్ రాయపుర ప్రధాన రహదారిలో లలితా జువెల్లరీ షోరూంను వరంగల్ ఎంపీ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణిలతో కలిసి షోరూమ్ ఎండీ డాక్టర్ ఎం కిరణ్‌కుమార్ ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ.. బంగారు అభరణాలు సొంతంగా వారి ఫ్యాక్టరీలోనే తయారు చేసి లలితా జువెల్లరీ షోరూంలో వినియోగదారులకు అందించడం అభినందనీయ పేద, మధ్య తరగతి ప్రజలకు సరసమైన ధరలలో అందుబాటులో ఉండే లలితా జువెల్లరీలో నగర ప్రజలు నగలు కొనుగోలు చేయాలని సూచించారు.
ఎమ్మె రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. లలితా జువెల్లరీ నాణ్యమైన నగలను అందించడంతోపాటు వరంగల్ నగరంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కూడా అవకాశం కల్పిస్తున్నదన్నారు. లలితా జువెల్లరీ ఎండీ కిరణ్ మాట్లాడుతూ.. తక్కువ తరుగు, తక్కువ ధరలలో బంగారు అభరణాలు అందించాలనే ఉద్దేశంతో హను తమ 57వ జువెల్లరీ షోరూంను ప్రారంభించామన్నారు.
ప్రారంభ ఆఫర్‌గా బంగారు నగలపై తరుగులో 2 శాతం తగ్గింపుతో పాటు వజ్రా క్యారెట్‌కు రూ.6 వేల తగ్గింపు ఇస్తున్నామన్నారు. సరికొత్త ఫ్రీ అండ్ ఫ్లెక్సీ 11 నెలల నగల కొనుగోలు పథకాన్ని ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో కార్పొ తోట వెంకటేశ్వర్లు, శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.