calender_icon.png 18 January, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ కాంస్య పోరులో లక్ష్యసేన్ ఓటమి

05-08-2024 07:40:16 PM

పారిస్: పారిస్ ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ లో భారత్ కు నిరాశ ఎదురైంది. భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ కాంస్య పతకం సాధించడంలో విఫలమయ్యారు. సోమవారం జరిగిన బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ కాంస్య పోరులో మలేషియాకు చెందిన జియాలీ చేతిలో లక్ష్యసేన్ 21-13, 16-21, 11-21 తేడాతో పరాజయం చెందారు.మెన్స్ సింగిల్స్ సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్సెన్ తో లక్ష్యసేన్ తలపడ్డి ఓటమిని చవిచూశారు. కాగా, ఈ పారిస్ ఒలింపిక్స్ 2024లో బ్యాడ్మింటన్ నుంచి భారత్ కు ఒక్క పతకం కూడా రాకపోవడం గమనార్హం.