calender_icon.png 31 October, 2024 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీస్‌లో లక్ష్యసేన్

03-08-2024 01:50:22 AM

  1. క్వార్టర్స్‌లో చైనీస్‌తైపీ ఆటగాడిపై విజయం 
  2. సెమీస్‌లో గెలిస్తే పతకం ఖాయం

పారిస్: భారత యువ షట్లర్ లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్‌లో సెమీస్‌లో అడుగుపెట్టాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్ 19 21 21 చైనీస్ తైపీకి చెందిన  చో టైన్ చెన్‌పై విజయం సాధించాడు. ఇక లక్ష్యసేన్ సెమీస్ గండం దాటితే భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరనుంది. ఒలింపిక్స్‌లో పురుషుల విభాగంలో భారత్ నుంచి ఒక్కరు కూడా పతకం సాధించలేకపోయారు. తాజాగా సెమీస్‌లో అడుగుపెట్టి సంచలనం సృష్టించిన లక్ష్యసేన్ పతకంతో తిరిగి రావాలని ఆశిద్దాం.

ఇక  మ్యాచ్‌లో విజయం కోసం లక్ష్యసేన్ బాగా చెమటోడ్చాల్సి వచ్చింది. 75 నిమిషాల పాటు జరిగిన పోరులో  మొదట లక్ష్యసేన్ వెనుకబడ్డాడు. ఆ తర్వాత అతను పుంజుకున్న తీరు అద్భుతం. మొదటి గేమ్ కోల్పోయినా ఏ మాత్రం అధైర్యపడని లక్ష్యసేన్ పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. రెండో గేమ్‌ను కష్టపడి గెలిచిన లక్ష్యసేన్ మూడో గేమ్‌లో మాత్రం ప్రత్యర్థికి అవకాశమివ్వలేదు. అంతకు ముందు క్వార్టర్స్‌లో లక్ష్యసేన్ భారత్‌కే చెందిన ప్రణయ్ మీద విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం సెమీస్ మ్యాచ్ జరగనుంది. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్ మినహా మిగతా అందరు షట్లర్లు ఇంటిబాట పట్టారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగు తేజం పీవీ సింధు ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగి నిరాశపరిచింది.