calender_icon.png 9 January, 2025 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో రౌండ్‌కు లక్ష్యసేన్

10-10-2024 12:00:00 AM

వన్‌టా (ఫిన్‌లాండ్): ఆర్కిటిక్ ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. తొలి రౌండ్‌లో లక్ష్య రాస్‌మస్ గెమ్కేతో ఆడాల్సి ఉండగా.. అతడు గాయంతో వైదొలగడంతో లక్ష్యకు రెండో రౌండ్ వాకోవర్ లభించింది. మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా 21-16, 23-25, 21-17తో జులియానా (బ్రెజిల్)పై, ఆకర్షి కశ్యప్ 21-19, 21-14తో జర్మనీకి చెందిన వొన్నెపై విజయాలు సాధించిన ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు.