జకర్తా: భారత టాప్ షట్లర్ లక్ష్యసేన్ ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీలో ప్రిక్వార్టర్స్‌కే పరిమితమయ్యాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 16 21 21 జపాన్‌కు చెందిన నిషిమొటో చేతిలో పరాజయం పాలయ్యాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ జోడీకి నిరాశే మిగిలింది.
ఇండియా ఓపెన్‌లో సెమీస్‌లో వెనుదిరిగిన ఈ జంట ఇండోనేషియా మాస్టర్స్‌లో మాత్రం రెండో రౌండ్‌కే పరిమితమైంది. ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్ జోడీ 20 21 కెడ్రెన్ చేతిలో ఓటమి పాలైంది. మహిళల డబుల్స్‌లోనూ భారత్‌కు ఓటమే మిగిలింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో గో జంట 13 24 21 తనీశా ద్వయంపై విజయం సాధించింది.