calender_icon.png 19 January, 2025 | 5:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిస్ ఒలింపిక్స్: సెమీస్‌లో లక్ష్యసేన్ ఓటమి

04-08-2024 05:20:39 PM

పారిస్: పారిస్ ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ సెమీస్ లో లక్ష్యసేన్ అందరినీ నిరాశ పరిచాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో సెమీ ఫైనల్స్ లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంకర్, డెన్మార్క్ ఆటగాడు విక్టర్ అక్కెల్సన్ చేతిలో లక్ష్యసేన్ 22-20, 21-14 తేడాతో ఓటమి  పాలయ్యారు.

సెమీస్ లో మ్యాచ్ ప్రారంభంలో లక్ష్యసేన్ అద్భుతంగా రాణించడంతో మొదటి సెట్ లో గెలుస్తాడని అందరు అనుకున్నారు. కానీ విక్టర్ అక్సెల్సెన్ చివరి దశలో  20-22 తేడాతో విజయం సాధించాడు. రెండో సెట్ ను 14-21 తేడాతో ఓటమి చవిచూసిన లక్ష్యసేన్ సోమవారం కాంస్య పతకం పోరులో తలపడనున్నారు. రేపు సాయంత్రం లీజీ(మలేషియా)తో  లక్ష్యసేన్ తలపడనున్నారు.