calender_icon.png 12 February, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్మీనరసింహస్వామి తృతీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు..

11-02-2025 09:01:07 PM

మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని సమితి సింగారం పంచాయతీలో గల శ్రీ సంకల్ప కార్యదర్శి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి వారోత్సవాల నేపథ్యంలో ధర్మకర్త, పూజారి అక్కినేపల్లి శ్యామ్ వార్షిక బ్రహ్మోత్సవాల వివరాలను తెలిపారు. బుధవారం నుండి 15వ తేదీ శనివారం వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. బుధవారం తెల్లవారు జాము ఐదు గంటల సమయంలో మంగళ వాయిద్యాలు నడుమ మంగళ తోరణంలో సుప్రభాత సేవ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి మూలవిరాట్ తో పాటు పరివార దేవతలకు ఉత్సవమూర్తులకు అష్టోత్తర శత కలశాభిషేకం అలంకారాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అనంతరం గోపూజ, శ్రీ విశ్వక్సేన మహాగణాధిపతి పూజ పుణ్యాహవాచనం రక్షాబంధన్ అఖండ దీపస్థాపన తదితర పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడం జరుగుతుందన్నారు. 13వ తేదీన గీత ధర్మ ప్రచార సేవాసమితి ఆధ్వర్యంలో యధావిధిగా పూజల అనంతరం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం లక్ష్మీనరసింహస్వామి మహామంత్ర ఆహ్వానం సుదర్శన, సర్వదేవత ఆవాహనములు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు అందజేయడం జరుగుతుందన్నారు.

14వ తేదీన యధావిధిగా సుప్రభాత సేవతో ప్రారంభమై ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి శ్రీ ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లతో వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీ ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత శ్రీ నరసింహ స్వామి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా శోభాయాత్ర నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు.