calender_icon.png 23 January, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్మిదేవిపల్లి సిపిఐ గ్రామశాఖ మహాసభ విజయవంతం

23-01-2025 04:49:28 PM

పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం, లక్ష్మిదేవిపల్లి గ్రామంలో గురువారం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గ్రామశాఖ మహాసభ నిర్వహించి, నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, ముత్యాల విశ్వనాథం పాల్గొని మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభల్లో సంక్షేమ ఫలాలు అర్హులైన అందరికీ ఇవ్వాలని రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా లాంటి పథకాలు రాజకీయాల కతీతంగా అర్హులైన అందరికీ ఇవ్వాలని ఉన్న వాళ్లకే మళ్లీమళ్లీ ఇల్లు వచ్చాయని ప్రజలు అంటున్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి అర్హులైన వారందరికీ షరతులు లేకుండా సంక్షేమ ఫలాలు అందించాలని డిమాండ్ చేశారు. 

సిపిఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ... భారతదేశంలో సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు అయిందని ఇప్పటివరకు దేశంలో ఏ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర కలిగి లేదని ప్రజలలో మమేకమై అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలంలో 10లక్షల ఎకరాలు భూములు పేదలకు పంచిపెట్టిందని, పేద, మధ్యతరగతి ప్రజలు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారని వారి తరఫున పోరాడి సమస్యలు పరిష్కరించేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. నూతన సిపిఐ గ్రామ శాఖ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 13 మందితో నూతనశాఖ సభ్యులను ఎన్నుకొన్నారు. శాఖ కార్యదర్శిగా భూక్య విజయ్ కుమార్, సహాయ కార్యదర్శిగా వేములపల్లి శేఖర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు వైస్ గిరి, వల్లపు యాకయ్య, ఎస్ కె లాల్ పాషా, Sk. ఖరీమ్, సీనియర్ నాయకులు సోమయ్య, నందిగామ నరసింహారావు కల్లోజి కిరణ్ కుమార్, ఎరుకుల రాకేష్, మిట్టపల్లి సుందరం, పటాని, జానీ, పుట్ట వెంకటరమణ, వజ్జా వంజి బాబు, కోరేం కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.