calender_icon.png 21 April, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి క్రీడా అధ్యక్షునిగా లక్ష్మీ నర్సా గౌడ్ ఎన్నిక

13-04-2025 07:32:05 PM

హోరా హోరీగా సాగిన ఎన్నికలు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి రియల్ ఎస్టే ట్ సంగం ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. అధ్యక్ష స్థానానికి లక్ష్మీ నర్సా గౌడ్ మాజీ అధ్యక్షులు రాము మధ్య హోరా హోరీగా పోటీ నెలకొంది. 200 మంది సభ్యులు ఉండగా 168 ఓట్లు పోలయ్యాయి. గడుకోల్ లక్ష్మీ నర్సా గౌడ్ కు 87 ఓట్లు రాగా మాజీ అధ్యక్షుడు రాముకు 79 ఓట్లు వచ్చాయి.

అధ్యక్షునిగా గడుకోల్ లక్ష్మీ నరస గౌడ్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా భూక్య రామ్ చందర్ నాయక్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా మాదాసు రాజలింగం ఎన్నికయ్యారు. గెలిచిన ప్రతినిధులకు పూలమాలలు వేసి సంబరాలు నిర్వహించారు. గత 20 రోజులుగా పోటాపోటీ కొనసాగిన ప్రచారం లో క్రేడా సభ్యులు పాల్గొని విజయోత్సవాలు జరుపుకున్నారు.