calender_icon.png 4 April, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్మీ నరసింహస్వామి హుండీ ఆదాయం రూ. 6,34,495

28-03-2025 12:00:00 AM

మఠంపల్లి ,మార్చి 27:  లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, మఠంపల్లి మండలంలోని మట్టపల్లి మహాక్షేత్రములో గురువారము హుండీ లెక్కింపు జరిగిందని. హుండీ లెక్కింపునకు దేవాదాయశాఖ నుండి పర్యవేక్షణ నిమిత్తం కె.భాస్కర్, సహాయ కమీషనర్, దేవస్థాన అనువంశిక ధర్మకర్త చెన్నూరు విజయ్ కుమార్, మట్టపల్లిరావు, కార్యనిర్వహణాధికారి సిరికొండ నవీన్, టి.వి.చలపతి, ఈ.ఓ, ల సమక్షములో హుండీ లెంక్కింపు జరిగిందని.

ఫిబ్రవరి 14 నుంచి మార్చి 26 (41రోజులు) రెగ్యులర్ హుండీ  మొత్తం  రూ.6,34,495/- ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.హుండీ లెక్కింపులో శ్రీ సాయి సేవా సంఘం వారు 40 మంది, దేవస్థాన అర్చకులు, సిబ్బంది, భక్తులు లెక్కించారు.