calender_icon.png 24 December, 2024 | 1:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష్మీ నగర్ బాధితుల నిరసన

08-09-2024 07:58:36 PM

చేవెళ్ల,(విజయక్రాంతి): బీజాపూర్ రహదారి విస్తరణలో భాగంగా చేవెళ్లలో నిర్మిస్తున్న బైపాస్ రోడ్డులో ప్లాట్లు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని లక్ష్మీ నగర్ కాలనీ బాధితులు డిమాండ్ చేశారు. 2018లో భూసేకరణ కోసం  నోటిఫికేషన్ ఇచ్చినా ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని వారు వాపోయారు. ప్లాట్లు కోల్పోతున్న బాధితులంతా ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొన్ని నెలలుగా అధికారులు, కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్న తమకు న్యాయం జరగడం లేదన్నారు.

పైసా పైసా కూడా పెట్టి ప్లాట్లు కొనుగోలు చేశామని.. ప్రభుత్వ పరిహారం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని తెలిపారు. పరిహారం ఇవ్వకుండా పనులు చేపడితే మాత్రం అడ్డుకుంటామని చెప్పారు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధితులు రాజశేఖర్ రెడ్డి, బసవరాజ్, సందీప్ కుమార్, కిరణ్, ప్రతాప్ రెడ్డి, సతీష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, అమృత, శ్రీదేవి,  నజీర సుల్తానా, షా ఫర్హాన్, సయ్యద్ జిశాన్ ముస్తఫా, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.