10-03-2025 12:35:12 AM
పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు, మార్చి 9 : తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని వెలిమెలలో శనివారం రాత్రి నిర్వహించిన లక్ష్మి అనంత పద్మ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. భక్తుల సమక్షంలో వేద మంత్రోచ్ఛారణల ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక నాయకులు, భక్తులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలోనే ప్రముఖ ఆలయంగా విరాజిల్లుతున్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్ పూర్ మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, మల్లా రెడ్డి, రవీందర్ రెడ్డి, కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.