17-03-2025 12:47:20 AM
హైదరాబా ద్, మార్చి 16 (విజయక్రాం తి): పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా గుండు లక్ష్మణ్ ఎన్నికయ్యారు. 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ఎన్నుకున్నట్లు పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్‌రెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. గుండు లక్ష్మణ్ గతంలో రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షు డిగా, ప్రధాన కార్యదర్శిగా, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. సమావేశంలో ఎమ్మెల్సీ పింగి లి శ్రీపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు బీ మోహన్‌రెడ్డి, నాయకులు పీ వెంకట్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.