calender_icon.png 3 April, 2025 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్షేట్టిపేట ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గం ఎన్నిక

02-04-2025 05:33:29 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): లక్షేట్టిపేట సర్కిల్ (దండేపల్లి, జన్నారం, లక్షేట్టిపేట మండలాల) ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గాన్ని బుధవారం ఐబీ విశ్రాంత భవన్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చింత అభినయ్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా జన్నారం మండలానికి చెందిన నూతి సంతోష్, ఉపాధ్యక్షులుగా ప్రశాంత్, ప్రదీప్, జాయింట్ సెక్రటరీలుగా సోక్రటీస్, అనిల్, కోశాధికారిగా శ్రీనివాస్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వై శ్రీనివాస్, ఎర్రం తిరుపతి, పేరం రమేష్, నిజామోద్దీన్, గడ్డం వినీత్, ఆకుల కిరణ్, ముస్తఫా, బుర్ర శ్రీనివాస్, రాజేష్, రమేష్, సతీష్, అనిల్, మహేష్, కుమార్, అజ్మాత్, మహేందర్ పాల్గొన్నారు.