calender_icon.png 19 January, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబ్బులకు డప్పులకు జరుగుతున్న పోరును విజయవంతం చేయాలి

18-01-2025 10:57:14 PM

జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జీ మంథని సామెల్ మాదిగ

కామారెడ్డి,(విజయక్రాంతి): డబ్బులకు డప్పులకు జరుగుతున్న పోరులో తాడోపేడో తేల్చుకునేందుకు ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ(MRPS Chief Manda Krishna Madiga) వెయ్యి గొంతులు లక్ష డప్పుల కర్యాక్రమాన్ని ఫిబ్రవరి 7న ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మార్పీఎస్ కార్యకర్తపై ఉందని జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంచార్జి మంథని సామెల్ మాదిగ(District MRPS Incharge Manthani Samel Madiga) అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్‌బి గెస్ట్‌హౌస్‌(R&B Guest House)లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సన్నాహాక సమావేశాలలో ఆయన మాట్లాడారు. ఈ నెల 25న కామారెడ్డి జిల్లాకు మందకృష్ణ రానున్నారని దానిని తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఒక వర్గం నుండి మరో వర్గానికి జరుగుతున్న పోరులో తమ సత్తాను చాటి  ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటకు గ్రామ గ్రామాలలో మాదిగలను చైతన్యవంతం చేయాలని సూచించారు. లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమానికి ప్రతి ఒక భుజానికి ఒక డప్పు సంకన వేసుకొని సమావేశానికి హాజరై విజయవంతం చేయాలన్నారు.

ఈ పాటికి మండలాల్లో నియోజకవర్గాల్లో సన్నాహ కార్యక్రమాలు నిర్వహించామని ఇంకా పూర్తి కమిటీలను ఏర్పాటు చేసి ఫిబ్రవరి 7న పూర్తిగా కమిటీలు ఏర్పాటు చేసి హైదరాబాద్ తరలించే విధంగా చూడాలన్నారు. ఇంటికొక్క హైదారాబాద్ తరలించే విధంగా చూడాలన్నారు. ఇంటికొక్క డప్పు తీసుకొని యువకులను కదలించే బాధ్యతతో సైతం నాయకులు చొరవ తీసుకోవాలని సూచించారు. మాదిగ మాదగ ఉపకులాలను సైతం కదిలించే విధంగా ముఖ్య నాయకలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని బాధ్యతలు తీసుకొని ఉపకులాలను సైతం బలోపేతం చేసే విధంగా కృషిచేయాలన్నారు. మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలు కష్టపడ్డారు. మనమందరం 30 రోజులు కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వామ్యం కావాలని కార్యకర్తలను కొరారు. ఈ కార్యక్రమంలో జిల్లానాయకులు బట్టు వెంకట్,రాములు, మహిళా అధ్యక్షుడురాలు లక్ష్మి, సీనియర్ నాయకులు కుంటోళ్ల యాదయ్య, గోరుగల్లు బాలరాజు, కొత్తల్ల యాదగిరి, బిఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షులు బాలరాజు, గడ్డం సంపత్, సాయిలు, రమేష్, పురుషోత్తం, రాజనర్సయ్య, బట్టు నరేష్, దాకయ్య, గణేష్, భూపతి తదితరులు పాల్గొన్నారు.