ముషీరాబాద్,(విజయక్రాంతి): ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, మాదిగల ఆశాజ్యోతి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ(Padma Shri Manda Krishna Madiga) నాయకత్వంలో ఈనెల 7న హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద "లక్ష డప్పులు- వెయ్యి గొంతులు" భారీ మాదిగ మహా ప్రదర్శనకు మాదిగలు వేలాదిగా తరలిరావాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి సీనియర్ నాయకుడు, ఎంఎస్పి ముషీరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి గజ్జల రాజశేఖర్ మాదిగ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం కవాడిగూడ డివిజన్లోని రోటరీ కాలనీలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ కవాడిగూడ డివిజన్ సీనియర్ నాయకుడు బండారి యాదగిరి, మాదిగ, మేకల రాజు మాదిగ ఆధ్వర్యంలో మహా ప్రదర్శనకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆయన పలువురు ఎమ్మార్పీఎస్ నేతలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం బస్తీలో వాల్ పోస్టర్ గోడలపై అంటించారు. సందర్భంగా గజ్జల రాజశేఖర్ మాదిగ, బండారు యాదగిరి మాదిగలు మాట్లాడుతూ... మాదిగలు, మాదిగ ఉపకులాలు ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్లోని ప్రతి బస్తి, ప్రతి ఇంటి నుంచి డప్పు భుజాన వేసుకొని లక్ష డప్పులు వెయ్యి గొంతులు భారీ మహా ప్రదర్శనకి తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి సీనియర్ నాయకులు, ఈటి. మల్లేష్ మాదిగ, సీ. రాజు మాదిగ, ఈటి. రమేష్ మాదిగ, ఆర్. మల్లేష్ మాదిగ, ఎస్.సురేందర్ మాదిగ, తుకారం మాదిగ, ఈటి . రాజు మాదిగ, ఇందూరి సాయి మాదిగ, లీలమ్మ మాదిగ, విజ్జు బాయ్ మాదిగ, సునీత మాదిగ, లక్ష్మీ భాయ్ మాదిగ, అమ్మగూడెం దశరథ్ మాదిగ, ఎంఎస్పీ నియోజవర్గం కోఆర్డినేటర్ ఇల్లెందుల ఎల్లయ్య మాదిగ, గడ్డం రమేష్ మాదిగ, దేశ పాండు నాగరాజు మాదిగ, అయిత సురేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,