06-02-2025 02:26:30 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): టేకులపల్లి మండలంలోని చద్రుతండాలో నకిలీ మొక్కజొన్న విత్తనాలు(Corn Seeds) విషయమై అక్కడి రైతుల ఫిర్యాదుతో బేతంపూడి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(Bethampudi Primary Agricultural Credit Society) చైర్మన్ లక్కినేని సురేందర్ రావుపై కేసు నమోదై, రిమాండ్ కు ఇల్లందు సబ్ జైలుకు తరలించిన విషయం విదితమే. ఆయన అక్కడ గురువారం అస్వస్థతకు గురికావడంతో ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లక్కినేనికి విరోచనాలు అవుతున్నాయని, బీపీ, షుగర్ లెవల్స్ తగ్గాయని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు.