పశువులకు రూ. 50 వేలు, మేకలు, గొర్రెలకు రూ.5 వేలు
ప్రభుత్వం జీవో విడుదల
హైదరాబాద్,సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మృతిచెందిన కుటుంబాలను ప్రభు త్వం ఆదుకోనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ సోమవారం ఉత్తర్వుల్లో తెలిపారు. మృతి చెందిన వారి కుటుం బాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా, పశువులకు రూ.50 వేలు, మేకలు, గొర్రెలకు రూ. 5 వేల చొప్పున ప్రభుత్వం అందించనుందని వెల్లడించారు. ఈ మేరకు జిల్లా అధికారులు బాధితులను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.