సోషల్‌మీడియాలో ఓ వ్యక్తి పోస్టు వైరల్
న్యూఢిల్లీ, ఆగస్టు 12: కూరగాయల ధరలు పెరిగె. నిత్యావసరాల ధరలు పెరిగె. ప్రయాణ చార్జీలు పెరిగె. చదువు ఫీజులు పెరిగె. పెట్రోల్ ధరలు పెరిగె. వంటగ్యాస్ ధరలు పెరిగె.. జీతా లు, ఆదాయం మాత్రం అంతే ఉండె... ఇక సంసారాన్ని ఈదేదెట్ల? ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానిది ఇప్పుడు ఇదే చింత. సంపాదనలోంచి ఉన్నంతలో అవసరాలు తీర్చుకొనేందు కు చాలా కుటుంబాలు తిండిపై పెట్టే ఖర్చులను కూడా తగ్గిస్తున్నాయి. నెలకు రూ.30 వేల జీతం ఉంటే ఓ మోస్తరుగా బతుకొచ్చని కొంద రు, రూ.50 వేల వచ్చినా సరిపోతలేవని కొంద రు వాపోతుంటారు. తాజాగా సోషల్‌మీడి యా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది.
ఏడాది రూ.25 లక్షల జీతం.. అంటే నెలకు రూ.1.5 లక్షలు వచ్చినా ముగ్గురు సభ్యుల కుటుంబం బతకలేకపోతున్నదని, నెల చివరకు వచ్చేసరికి చేతిలో పైసా ఉండటం లేదని సౌరవ్ దత్త అనే వ్యక్తి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతి నెల ఏ అవసరాలకు ఎంత ఖర్చు చేస్తున్నది లెక్కలు కూడా చెప్పాడు. నిత్యావసరాలు, ఈఎంఐలు, ఇంటి కిరాయికే నెల సంపాదనలో రూ.లక్ష పోతున్నదని, ము గ్గురు సభ్యుల కుటుంబ ఆహార అవసరాలకు, సినిమాలకు, ఓటీటీ చార్జీలకు, ఒకరోజు విహారానికి రూ.25 వేలు, అత్యవసరాలకు, ఔషధా లకు రూ.25 వేలు పోతున్నదని లెక్క చెప్పాడు. ఇక పొదుపు చేయటానికి ఏమున్నదని నిర్వేదం వ్యక్తంచేశాడు. ఇతడి లెక్కపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.