ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): వరదలతో మృతిచెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 50 లక్షల చొప్పున నష్టపరిహా రం చెల్లించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరదలతో కొట్టుకుపోయిన రోడ్లు, బ్రిడ్జులను వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిర్వాసితులకు వరద సహాయక కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. వరద సహాయక కార్యక్ర మాల్లో పాల్గొన్న రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. వరద తగ్గుముఖం పట్టిన వెంటనే పంట నష్ట పరిహారాన్ని అంచనా వేసి, బాధితులకు అందించాలన్నారు. బీజేపీ నా యకులు, కార్యకర్తలు ప్రజలకు సహా య సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.