08-04-2025 10:45:19 PM
నేతకాని మహర్ సంఘం వెల్లడి..
బెల్లంపల్లి (విజయక్రాంతి): నేతకాని మహర్ హక్కుల సేవా సంఘం జిల్లా భవనానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ఎంపీ ల్యాండ్స్ నిధులు రూ.50 లక్షలు మంజూరు చేయించారని తెలంగాణ నేతకాని హక్కుల సేవా సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దుర్గం గోపాల్, జిల్లా సీనియర్ నాయకులు ముడిమడుగుల మహేందర్ లు తెలిపారు. మంగళవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2023లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గడ్డం వివేక్ లు జిల్లా నేతకాని సంఘం భవనానికి నిధులు మంజూరు చేయించి భవన నిర్మాణానికి అన్ని విధాల కృషి చేస్తామని వారు ఇచ్చిన హామీని నేడు ఎంపీ నిలబెట్టుకున్నారని వారు స్పష్టం చేశారు.
ఎంపీకి, ఎమ్మెల్యేలు తమ సంఘానికి చేసిన చేసిన కృషి జీవిత కాలం మర్చిపోమన్నారు. 2007లో జాడి మల్లయ్య 12 గుంటల భూమి ఇవ్వడంతో మంచిర్యాల పట్టణంలోని సున్నం బట్టివాడలో రూ.3 కోట్లతో భావన నిర్మాణం చేపట్టామన్నారు. అందుకు ఐటీడీఏ చీప్ ఇంజనీర్ ముడిమడుగుల శంకర్ నేడు ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎంపీ కోటా నిధులు మంజూరు చేయించడంతో భవనంలో రెండవ అంతస్తు నిర్మించనున్నట్టు వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నేతకాని మహర్ హక్కుల సేవా సంఘం జిల్లా నాయకులు జాడి మహేష్, గట్టు బానేష్, గట్టు శివ లింగయ్య, దుర్గం రామకృష్ణ, గోమాస రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.