11-02-2025 12:28:45 AM
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి ౧౦ (విజయ క్రాంతి): రాష్ర్ట ఎక్సుజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్సుజ్ శాఖ అమ్యామ్యా లకు అలవాటు పడిందని ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ఏ చిన్న పని జరగాలన్నా భారీ స్థాయిలో ముడుపులు ముట్ట చెప్ప నిదే పనులు జరిగే పరిస్థితి లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
గౌడ సామాజిక వర్గం కుటుంబీకులు తమ వృత్తిని కొనసాగిం చడం కోసం కల్లుగీత కార్మికులుగా గుర్తింపు కోసం కోపరేటివ్ సొసైటీ, టిఎఫ్ టి లైసె న్సులు పొందాలంటే లక్షలు ముట్ట చెప్పాల్సి న పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్టు ఎక్కగలిగే గీత కార్మికునికి సైతం లైసెన్స్ లు ఇచ్చేందుకు ఆప్కారి శాఖ అధికారులు అవినీతి సొమ్ముకు కక్కుర్తి పడు తున్నారు. ఆయా సర్కిల్ స్టేషన్ పరిధిలోని కిందిస్థాయి అధికారుల నుంచి ఉన్నతాధికా రుల వరకు ఒకే రకమైన దోపిడీకి అలవాటు పడ్డట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ ముడుపులన్నీ మంత్రులకు వాటాల పేరుతో నే దబాయించి వసూలు చేస్తున్నట్లు ఆరోప ణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో టిఎఫ్టి లైసెన్స్ కోసం సుమారు లక్షల నుంచి రెండు లక్షల దాకా వసూళ్లు చేస్తున్నారు. దీంతోపా టు సందర్భాన్ని బట్టి దావత్ కూడా ఇవ్వా ల్సిందే నని బాధితులు వాపోతున్నారు. అరత ఉన్నప్పటికీ లైసెన్సులు పొందే పరి స్థితి లేకపోవడంతో నిరుపేద కల్లుగీత కార్మి కులు మనోవేదనకు గురవుతున్నారు.
ము డుపులు ఇచ్చిన వారికి మాత్రం అధికారి ఫీల్డ్ లోకి వెళ్లకుండా వారి స్థానంలో అధికా రి హోదాలో ఓ ఫోటోగ్రాఫర్ ను పంపి స్వ యంగా చెట్టెక్కినట్లు సృష్టించి ఫోటోలు ఆధారంగా చూపి లైసెన్సులను ముట్ట చెబుతున్నట్లు ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. దీంతో అరత లేని లైసెన్స్ దారులు విషపూరితమైన మత్తు పదార్థాలు వినియోగించి కృత్రిమంగా కల్తీ కళ్ళు తయా రుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడు తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వా త ఈ దోపిడీ మరింత పెరిగిందని ఆయా గ్రామాల గౌడ సామాజిక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఐదు సర్కిల్ ఎక్సుజ్ పోలీస్ స్టేషన్లో ఉండగా జిల్లావ్యాప్తంగా టిఎఫ్టి లైసెన్స్ పొందిన వారు 221, టిసిఎస్ కో-ఆపరేటివ్ సొసైటీలు 59 ఉన్నాయి. గౌడ సామాజిక వర్గంలోని నిరుద్యోగులు చెట్టు ఎక్కి కళ్ళు గీసే వృత్తిని ఎంచుకొని ఆ ప్రతిభ ఉన్నవారికి ప్రభుత్వం టిఎఫ్టి, టిసిఎస్ లైసెన్సులు సాధారణ డిడి రూపంలో మాత్ర మే తీసుకోవాల్సి ఉంది.
కానీ ఆయా సర్కిల్ పరిధిలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు అడ్డగో లుగా వారి నుంచి ముడుపులు ఆశిస్తున్నా రని తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరి కొందరిలో అరత లేకపోయినా ముడుపు లందుకొని నిబంధనలకు విరుద్ధంగా వారికి లైసెన్సులు ఇస్తున్నట్లు అరత గల గౌడ సామాజిక వర్గం నేతలు ఆరోపిస్తు న్నారు.
మంత్రి ఇలాకాలోనే భారీగా వసూలు.!
రాష్ర్ట ఎక్సుజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న నాగర్క ర్నూల్ జిల్లాలో ఏ స్టేషన్లో చూసిన ఆప్కారి శాఖ అధికారులు ముడుపులు ముట్ట చెప్పం డి పని చేయడం లేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ముడుపులమ్మ వాటా లు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులకు వెళ్తాయని బాహాటంగానే చెప్పుకుంటున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
ఈ వ్యవ హారం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మరింత పెచ్చుమెరిపోయిందని తద్వారా కల్తీకల్లు మాఫియా మరింత పెరుగుతుందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తెలకపల్లి పరిధిలోని ఓ గ్రామానికి చెందిన గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి టి ఎఫ్ టి లైసెన్స్ కోసం అధికారులు తన వద్ద ఎంత మేర వసూలు చేశారో చెబుతూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.