calender_icon.png 31 October, 2024 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ కుట్టిన చెప్పులకు 10 లక్షలు

02-08-2024 01:43:59 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 1: కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ కుట్టిన చెప్పులకు ఇప్పుడు యమా గిరాకీ వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో రోడ్డుపక్కన ఉన్న ఓ చిన్న చెప్పుల దుకాణానికి డబ్బు సంచులతో వెళ్లి మరీ ఆ చెప్పులను బేరమాడుతున్నారు. విషయం ఏమిటంటే జూలై 26న రాహుల్‌గాంధీ సుల్తాన్‌పూర్ శివార్లలో ఉన్న ఓ చెప్పుల షాపుకు వెళ్లిన అక్కడ చెప్పులు కుడుతున్న రామ్‌చేత్ అనే వ్యక్తితో కొద్దిసేపు ముచ్చటించారు. ఆయనతో మాట్లాడుతూనే ఓ చెప్పు కుట్టారు. అంతే ఇప్పుడు రామ్‌చేత్‌తోపాటు రాహుల్ చెప్పులు కూడా సెలబ్రెటీలయ్యాయి. రూ.10 లక్షలు ఇస్తాం ఆ చెప్పులు ఇవ్వాలని కొందరు ఆఫర్ ఇస్తున్నారట. అయినా, తాను వాటిని అమ్మబోనని, రాహుల్ జ్ఞాపకంగా ఉంచుకొంటానని రామ్‌చేత్ చెప్పటం గమనార్హం.