calender_icon.png 24 February, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పందెం కోళ్లకు 16 లక్షలు

18-02-2025 01:35:47 AM

* ఇటీవల తోల్‌కట్ట ఫామ్‌హౌస్‌లో పోలీసుల తనిఖీలు

* పట్టుబడిన కోళ్లకు రాజేంద్రనగర్ కోర్టులో వేలంపాట

మొయినాబాద్, రాజేంద్రనగర్, ఫిబ్రవరి 17: ఈనెల 11న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని తోల్‌కట్టలోని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన ఫాంహౌస్‌లో రాజేంద్రనగర్ పోలీ  దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. పోలీసులు 61 మందిని అదుపులోకి తీసుకొని రూ.30 లక్షల నగదు, 46 కోడికత్తులు, 55 కార్లు, 64 ఫోన్లు, 84 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులతోపాటు కోళ్లను కోర్టులో అప్పగించారు. అయితే మొత్తం 84 కోళ్లలో మూడు చనిపోవడంతో వాటికి పోస్టుమార్టం నిర్వహించి రి  న్యాయ   సమర్పించారు. మిగతా 81 కోళ్లకు సోమవారం రాజేంద్రనగర్‌లోని కోర్టు ఆవరణలో న్యాయమూర్తి వే  నిర్వహించారు. 10 కోళ్లను ఒక స్లా  విభజించి ఆక్షన్ వేశారు. దాదాపు 10  మంది పాల్గొన్న ఈ వేలంపాటలో తొలి 10 కోళ్లకు 3.75 లక్షలు, తర్వాతి పదింటికి 2.5 లక్షలు.. ఇలా మొత్తం 81 కోళ్లకు రూ.16 లక్షల 60 వేలు పలికాయి. ఈ డబ్బులతోపాటు పోలీసులు తమ దాడుల్లో స్వాధీనం చేసుకున్న డబ్బులను ప్రభుత్వ ఖాతాలో జమచేశారు.