calender_icon.png 16 January, 2025 | 10:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిష్ణోయ్ ఖర్చులకు రూ.40 లక్షలు

21-10-2024 12:00:00 AM

  1. చిన్నప్పుడే ఖరీదైన దుస్తులు వేసుకునేవాడు
  2. జైల్లో ఉన్నా ఏడాదికి రూ.40 లక్షల ఖర్చు
  3. ఆసక్తికర విషయాలు వెల్లడించిన అతడి బంధువు రమేష్

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: మహారాష్ట్ర మాజీమంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. లారెన్స్ సమీప బంధువు రమేష్ బిష్ణోయ్ తాజాగా అతడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేసిన బిష్ణోయ్.. గ్యాంగ్‌స్టర్‌గా మారతాడని తాను ఊహించలేదని ఆయన పేర్కొన్నారు.

జైల్లో రిమాండ్‌లో ఉన్న బిష్ణోయ్ ఖర్చుల కోసం అతడి కుటుంబం ఏడాదికి  రూ.40 లక్షలకు పైగా వెచ్చిస్తున్నట్లు రమేశ్ బిష్ణోయ్ వెల్లడించారు. లారెన్స్‌ది ముందునుంచి సంపన్న కుటుంబమని పేర్కొన్నాడు. ‘వారికి మా గ్రామంలో దాదాపు 110 ఎకరాల భూమి ఉంది. లారెన్స్ ఎప్పుడూ ఖరీదైన దుస్తులు, బూట్లు ధరించేవాడు.

ఇప్పుడూ జైల్లో ఉన్న అతడి కోసం మా కుటుంబం ఏడాదికి రూ.40 లక్షలు ఖర్చు చేస్తోంది’ అని రమేశ్ బిష్ణోయ్ పేర్కొన్నారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ జిల్లా ధత్తరన్‌వాలీలో జన్మించిన బిష్ణోయ్ అసలు పేరు బాల్కరన్ బ్రార్. స్కూళ్లో చదువుతున్న టైమ్‌లో లారెన్స్ బిష్ణోయ్‌గా పేరు మార్చుకున్నాడు.