- బాధితుడి తండ్రికి చెక్కు అందించిన నిర్మాత నవీన్
- మంత్రి కోమటిరెడ్డితో కలిసి బాలుడికి పరామర్శ
- హైదరాబాద్ కేంద్రంగానే టాలీవుడ్: మంత్రి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (విజయక్రాంతి): సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అస్వస్థత పాలై హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సోమవారం చిత్రనిర్మాతల్లో ఒకరైన నవీన్ యేర్నేనితో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డితో కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా నిర్మాత నవీన్ బాధితుడి తండ్రి భాస్కర్‌కు రూ.50 లక్షల విలువైన చెక్కు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. టాలీవుడ్ చిత్రపరిశ్రమ ఎక్కడికీ తరలివెళ్లదని, హైదరాబాద్ కేంద్రంగానే ఉంటుందనిస్పష్టం చేశారు. చిత్రపరిశ్రమపై వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మొద్దని సూచించారు.
తొక్కిసలాట ఘటనను ఎవ రూ రాజకీయం చేయవద్దని హెచ్చరించారు. ఎవరూ సినీస్టార్ల నివాసాలపై దాడులు చేయవద్దని సూచించారు. ఎవరైనా దాడు లు చేస్తే చట్టం ఊపేక్షించబోమని స్పష్టం చేశారు.
శ్రీతేజ్ పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని, దేవుడి దయ వల్ల బాలుడు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి తెలిపారు. శ్రీతేజ్‌ను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. బాలుడు పూర్తి ఆరోగ్యవంతుడిగా మారాలని ఆకాంక్షించారు.