29-03-2025 11:20:43 PM
వీరమాచినేని వసుంధర ఫౌండేషన్ సేవలు అభినందనీయం..
పాఠశాల రూపు రేఖలు మార్చిన వి స్టాప్ కన్సల్టింగ్..
అభినందించిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..
కోదాడ: కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు 10 లక్షల రూపాయలతో వీరమాచినేని వసుంధర ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్ ల్యాబ్, ఫర్నిచర్, టాయిలెట్స్, స్కూల్ యూనిఫామ్,షూస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించినందుకు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించేందుకు వీరమాచినేని వసుంధర ఫౌండేషన్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.. ఈ కార్యక్రమంలో వీరమాచినేని వసుంధర ఫౌండేషన్ సభ్యులు వీసా కన్సల్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ వీరమాచినేని పూర్ణ భాస్కర్, రాధిక, గోపాలకృష్ణ,సురేష్, మాధవి, సైదా నాయక్, స్వామి నాయక్, ప్రధానోపాధ్యాయులు ఇందిర, ఉపాధ్యాయులు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.