calender_icon.png 25 November, 2024 | 3:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

4 లక్షల టన్నుల ఎరువులు రెడీ!

27-08-2024 02:30:03 AM

  1. వానకాలం పంట సాగుకు సిద్ధం 
  2. రెండు రోజుల్లో జిల్లాలకు  
  3. డీలర్లు ఎరువులు బ్లాక్ చేస్తే కఠిన చర్యలు 
  4. విక్రయించిన ప్రతి బస్తాకు రసీదు ఇవ్వాలి 

హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాం తి): వానకాలం పంటల సాగుకు సరిపడా ఎరువులను సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం నాలుగు లక్షల టన్నులు సిద్ధం చేసింది. రెండు మూడు రోజుల్లో జిల్లా గోదాములకు తరలించేందుకు సన్నద్ధం అయ్యింది.  వారం రోజుల నుంచి మండల కేంద్రాల్లో ఎరువుల దుకాణాల్లో కొరత ఉండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. స్థానిక వ్యవసాయ అధికారులతోపాటు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి విషయం రావడంతో  అధికారులతో సమావేశం నిర్వహించి ఎరువుల వివరాలను తెలుసుకున్నారు. వెంటనే సరిపడా ఎరువులు సరఫరా చేసి, బ్లాక్ మార్కెట్ విక్రయాలు జరగకుండా చూడాలని ఆదేశించా రు. అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు వేగిరం చేశారు.  ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6.71 లక్షల టన్నుల యూరియా, 1.97 లక్షల టన్నుల డీఏపీ, 6.02 లక్షల టన్నుల కాంప్లెక్సు ఎరువులు, 0.15 లక్షల టన్నుల పొటాష్‌ను రైతులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం 4.17 లక్షల టన్నుల కాంప్లెక్సు ఎరువులు, 0.42 లక్షల టన్నుల డీఏపీ, 3.16 లక్షల టన్నుల కాంప్లెక్సు ఎరువులు, 0.30 లక్షల టన్నుల పొటాష్ అందుబాటులో ఉన్నదని, త్వరలోనే దానిని జిల్లాలకు తరలించనున్నట్టు అధికారులు వెల్లడించారు. 

రైతులకే ఎరువులు అమ్మాలి 

మండల కేంద్రాల్లోని ఎరువుల దుకాణదారులు రైతులకు ఎరువులు విక్రయించా లని వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. ఏజెంట్లకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రతి బస్తాకు లెక్క ఉండాలని, కొనుగోలు చేసిన రైతుకు కచ్చితంగా రశీదు ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రకటించిన ధరలకే అమ్మాలని, గోదాముల్లో అక్రమంగా నిల్వలు పెట్టి కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తే తీవ్ర చర్యలు ఉంటాయన్నారు. దుకాణదారులంతా కుమ్మక్కై సొంతగా ధరలు నిర్ణయించి రైతులను మోసం చేస్తే కేసులు పెడుతామని చెప్పారు.  నిబంధనలు ఉల్లఘించకుండా రైతులకు సకాలంలో ఎరువులు ఇవ్వాలని సూచించారు.