calender_icon.png 17 October, 2024 | 2:29 AM

తెలంగాణలో 20 లక్షల సభ్యత్వాలు పూర్తి

16-10-2024 02:26:23 AM

24 వరకు సభ్యత్వ నమోదు పొడిగింపు

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి):  తెలంగాణలో ఇప్పటివరకు 20 లక్షల బీజేపీ సభ్యత్వాలు నమోదు అయ్యాయని -బీజేపీ సభ్యత్వ నమోదు ఇన్‌ఛార్జి ఎన్ రాంచందర్ రావు తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తల ద్వారా 16 లక్షలకుపైగా సభ్యత్వాలు నమోదు కాగా.. మిస్డ్ కాల్స్ ద్వారా 4 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు అయ్యాయని ఆయన వెల్లడించారు.

మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 8 కోట్ల సభ్యత్వాలు నమోదు అయ్యాయని తెలిపారు. ఈ నెల 15నే సభ్యత్వ నమోదుకు చివరి తేదీ అయినా దసరా వల్ల సభ్యత్వాలకు కాస్త ఆటంకం ఏర్పడిందని, అందుకే ఈ నెల 24 వరకు ్న పొడిగించామన్నారు.

బూత్ సభ్యత్వ ఫారాలను సేకరించడానికి, జిల్లా స్థాయిలో సభ్యత్వ నమోదు ప్రస్తుత స్థితిని సమీక్షించడానికి బుధవారం నుంచి జిల్లాల వారీగా నేతల పర్యటన ఉంటుందని తెలిపారు. సభ్యత్వ నమోదు లక్ష్యాలను సాధించడంలో జిల్లా, మండల యూనిట్లకు మార్గనిర్దేశం చేయడానికి అక్టోబర్ 16 నుంచి 24 వరకు జిల్లా స్థాయి సభ్యత్వ నమోదు పర్యటనలు నిర్వహిస్తారని అన్నారు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ముఖ్య నాయకులు జిల్లాల్లో పర్యటించనున్నారని వివరించారు.