ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
సీతారామ ఎత్తిపోతల పథకానికి ప్రారంభం
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 14 (విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఖమ్మ జిల్లా వైరాలో నిర్వహించే బహిరంగ సభలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ ప్రకటన చేస్తారు. ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకాన్ని సీఎం ప్రారంభిస్తారు. ముకలపల్లి మండ లం పూసుగూడెంలో పంపుహౌస్ వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను ప్రారంభించి పూజలు నిర్వహిస్తారు.
అనంతరం 2వ పంపుహౌస్‌కు స్విచ్ ఆన్‌చేసి పథకాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి హెలిక్యాప్టర్ ద్వారా వైరా చేరుకొంటారు. బహిరంగ సభలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ ప్రకటన చేస్తారు. అర్హులైన రైతులకు చెక్కులను పంపిణీ చేస్తారు. అక్కడి నుంచి తిరిగి హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్ చేరుకొంటారు. అలాగే సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన మూడు పంపుహౌస్‌లను ముగ్గురు మంత్రులు ప్రారంభిస్తారు. ములకలపల్లి మండలం కమలాపురంలోని పంపుహౌస్3ని డిప్యూటీ సీఎం భట్టి, అశ్వాపురం మండలం బిజీ కొత్తూరులో పంపుహౌస్ 1ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కోమటిరెడ్డి ప్రారంభిస్తారు.
ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల
సీఎం పర్యటన సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పూసుగూడెంలో గల సీతారామ ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌లను బుధ వారం పరిశీలించారు. సీఎం ప్రారంభించనున్న ముకలపల్లి మండ లం పూసుగూడెంలో 2వ పంపుహౌస్ వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం ములకలపల్లి మండలం కమలాపురంలోని మూడో పంపుహౌస్ ట్రయల్న్‌న్రు ప్రారంభించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంట కలెక్టర్ జితేష్ వీ పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, డీఆర్డీవో విద్యాచందన, నీటిపారుదలశాఖ ఇంజినీర్లు ఉన్నారు.