భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 18 (విజయక్రాంతి): ఒడిశా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాండా జిల్లాకు కారులో తరలిస్తున్న రూ.11 లక్షల విలువగల 31.06 కిలోల గంజాయిని శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సమీపంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికా మూలు పట్టుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సీహెచ్ శ్రీనివాస్ మీడియాకు వివరాలువెల్లడించారు.
బాండా జిల్లా చెందిన అంజనీ కుమార్, సంజీవ్‌కుమార్ కారులో గంజాయిని తరలిస్తు పోలీసులకు సమాచారం అందింది. భద్రాచలం చెక్‌పో వద్ద తనిఖీలు చేపట్టగా వారు పట్టుబడ్డారు. గంజాయితో పాటు కారు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.