ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్టు
హనుమకొండ, ఆగస్టు 3(విజయక్రాం తి): రూ.64 లక్షల విలువైన గంజాయిని వరంగల్ పోలీసులు పట్టుకుని, ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేశారు. శనివారం హనుమకొండలోని పోలీస్ కమిషన రేట్‌లో సీపీ అంబర్ కిషోర్ ఝా వివరాలు వెల్లడించారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన బానోతూ బాబు కుమారస్వామి, అంగోతు రాజేందర్, మహబూబాబాద్‌కు చెందిన జలేందర్, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ముకుంద్ ముఠాగా ఏర్పడి గంజాయి రవాణా చేస్తున్నారు. ఏపీలోని డొంకరాయి గ్రామంలో గంజాయిని కోనుగోలు రెండుకిలోల చొప్పున 128 ప్యాకెట్లను భద్రాచలం, మహబూబాబాద్ మీదుగా నర్సంపేటకు కారులో తరలిస్తున్నారు. పోలీసులకు సమచారం రావడంతో శనివారం ఉదయం టాస్క్ ఫోర్స్ , నర్సంపేట పోలీసులు కమలాపురం క్రాస్ రోడ్డు, నర్సంపేట వద్ద నిం దితులను పట్టుకున్నారు. నిందితులు బాబు కుమారస్వామి, జలేందర్‌ను అదుపులోకి తీసుకోగా ముగ్గురు పరారయ్యారు. వారి నుంచి రూ. 64 లక్షల విలువ గల 256 కిలోల గంజాయితో పాటు, రెండు కార్లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.